NTV Telugu Site icon

Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్‌ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్‌!

Virat Kohli 49th Century

Virat Kohli 49th Century

Sachin Tendulkar Feels Virat Kohli’s Will Hits 50th Century in Next Few Days: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే.. శతకాలలో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంటాడు. విరాట్ వన్డేల్లో 50వ సెంచరీ సెంచరీ చేయాలని సచిన్ కోరుకున్నాడు.

‘విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడావ్‌. ఈ ఏడాదిలో నేను 49 నుంచి 50కి (వయసు పరంగా) చేరుకోవడానికి నాకు 365 రోజులు పట్టింది. కానీ రాబోయే కొన్ని రోజుల్లోనే నువ్వు 49 నుంచి 50కి (సెంచరీలు) చేరుకుని.. నా రికార్డు బద్దలుకొడతావని ఆశిస్తున్నా. శుభాకాంక్షలు’ అని సచిన్‌ టెండూల్కర్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ 2023లోనే విరాట్ 50వ సెంచరీ చేయాలని సచిన్ ఆశిస్తున్నాడు. విరాట్ ఫామ్ చూస్తే.. లీగ్ దశ చివరి మ్యాచ్‌లోనే సచిన్ కోరికను నెరవేర్చే అవకాశం ఉంది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

సచిన్‌ టెండూల్కర్ ట్వీట్‌పై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ‘నా కోసం సచిన్‌ టెండూల్కర్ చేసిన ట్వీట్‌ చాలా ప్రత్యేకమైంది. నా హీరో రికార్డును సమం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. సచిన్‌ పరిపూర్ణ బ్యాటర్‌. ఇది నాకు భావోద్వేగ క్షణం. సచిన్‌ను టీవీల్లో చూసిన రోజులు నాకు గుర్తున్నాయి. అంతటి గొప్ప ఆటగాడి నుంచి ప్రశంసలు పొందడం నాకెంతో ప్రత్యేకమైంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కోహ్లీ 49వ సెంచరీని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కెరీర్‌లో 463 వన్డేలు ఆడిన సచిన్ 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా.. విరాట్ మాత్రం 277 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సమం చేశాడు.

Show comments