Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar Feels Virat Kohli’s Will Hits 50th Century in Next Few Days: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే.. శతకాలలో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంటాడు. విరాట్ వన్డేల్లో 50వ సెంచరీ సెంచరీ చేయాలని సచిన్ కోరుకున్నాడు.
‘విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడావ్. ఈ ఏడాదిలో నేను 49 నుంచి 50కి (వయసు పరంగా) చేరుకోవడానికి నాకు 365 రోజులు పట్టింది. కానీ రాబోయే కొన్ని రోజుల్లోనే నువ్వు 49 నుంచి 50కి (సెంచరీలు) చేరుకుని.. నా రికార్డు బద్దలుకొడతావని ఆశిస్తున్నా. శుభాకాంక్షలు’ అని సచిన్ టెండూల్కర్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023లోనే విరాట్ 50వ సెంచరీ చేయాలని సచిన్ ఆశిస్తున్నాడు. విరాట్ ఫామ్ చూస్తే.. లీగ్ దశ చివరి మ్యాచ్‌లోనే సచిన్ కోరికను నెరవేర్చే అవకాశం ఉంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
సచిన్ టెండూల్కర్ ట్వీట్‌పై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘నా కోసం సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ చాలా ప్రత్యేకమైంది. నా హీరో రికార్డును సమం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. సచిన్ పరిపూర్ణ బ్యాటర్. ఇది నాకు భావోద్వేగ క్షణం. సచిన్‌ను టీవీల్లో చూసిన రోజులు నాకు గుర్తున్నాయి. అంతటి గొప్ప ఆటగాడి నుంచి ప్రశంసలు పొందడం నాకెంతో ప్రత్యేకమైంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కోహ్లీ 49వ సెంచరీని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కెరీర్లో 463 వన్డేలు ఆడిన సచిన్ 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా.. విరాట్ మాత్రం 277 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సమం చేశాడు.
Well played Virat.
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!