IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఆడుతాడా?
- మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్
- ప్రాక్టీస్ సెషన్‌కు బాబర్ అజామ్ డుమ్మా
- భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ డుమ్మా కొట్టాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
పాకిస్తాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్ మీడియాతో మాట్లాడుతూ.. బాబర్ అజామ్ గైర్హాజరీని చిన్న అంశంగా పేర్కొన్నాడు. బాబర్ ప్రాక్టీస్ సెషన్ నుంచి రెస్టు కావాలని కోరినట్లు తెలిపాడు. భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడుతాడని స్పష్టం చేశాడు. టీమిండియాపై బాగా ఆడుతాడనే ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్ విషయంలో పాక్ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇందుకు కారణం ఇటీవల భారత్ చేతిలో ఓడిపోవడమే. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆటగాళ్లతో సమావేశమయ్యారు. జట్టు సెలక్షన్‌పై పీసీబీ చీఫ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు దుబాయ్ వెళ్లారు.
Also Read
బంగ్లాపై ఘన విజయంతో టీమిండియా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్‌పై కూడా గెలిచి టోర్నీలో ముందంజ వేయాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఈ నేపథ్యంలో పాక్ గట్టిగానే పోరాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో పాక్ మూడు సార్లు నెగ్గగా.. రెండు సార్లు భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!