IND vs PAK: భారత్‌తో మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaheen Afridi injury scare ahead of IND vs PAK Clash: ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బుధవారం ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. మైదానంలో మోకాలి నొప్పితో అతడు బాధపడ్డాడు. అదే సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కవగా ఉండడంతో అఫ్రిది ఇబ్బందిపడ్డాడు. ఫిజియో సలహా మేరకు అతడు మైదానాన్ని వీడాడు. నేపాల్ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిది.. 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో అఫ్రిది కోలుకుంటాడని పాక్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది.
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
Also Read: Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్.. నిర్మాత వెంకట్ ఫోన్ మిస్సింగ్..!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (4/27) నేపాల్ నడ్డివిరిచాడు.
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!