IND vs PAK Match Refund: భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్‌కు రీఫండ్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Match Refund: T20 ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని ప్రకటించి, T20 ప్రపంచ కప్‌లో కలకలం రేపింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో టోర్నమెంట్ భాగస్వాములందరికీ (ICC, BCCI, స్పాన్సర్లు) పెద్ద మొత్తంలో నష్టాలు రావడమే కాకుండా, ఈ ‘మెగా మ్యాచ్’ చూడటానికి ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పాకిస్థాన్ ప్రకటన తర్వాత, భారత్- పాక్ మ్యాచ్‌ను చూడటానికి ముందు గానే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో అని ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఈ విషయంలో ICC నియమాలు ఏమి చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ICC టికెట్ రీఫండ్ పాలసీ..
ICC టికెట్ రీఫండ్ పాలసీ ప్రకారం.. కొన్ని పరిస్థితులలో మాత్రమే మీ టికెట్‌కు పూర్తి వాపసు లభిస్తుంది.
1. టాస్ లేకుండా మ్యాచ్ రద్దు చేస్తే, టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు వారి పూర్తి డబ్బు తిరిగి ఇస్తారు.
2. గ్రూప్ దశ లేదా సూపర్ 8 రౌండ్ ముగిసేలోపు ఐదు ఓవర్ల ముందు మ్యాచ్ రద్దు అయితే, ప్రేక్షకులకు వారి టిక్కెట్ల డబ్బులను పూర్తిగా వాపసు ఇస్తారు.
3. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ 10 ఓవర్లకు ముందే రద్దు చేస్తే, మ్యాచ్ ఫలితం రాకపోతే, మీ టికెట్ డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.
ఈ పరిస్థితులలో నో వాపసు..
1. గ్రూప్ దశలో లేదా సూపర్ 8 రౌండ్లో ఐదు ఓవర్ల కంటే ఎక్కువ ఆడి మ్యాచ్ నిర్ణయం కాకపోతే, డబ్బు తిరిగి ఇవ్వరు.
2. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ 10 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఉండి ఫలితం రాకపోతే, టికెట్ డబ్బులు తిరిగి చెల్లించరు.
3. ఏదైనా మ్యాచ్ ఫలితం అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రేక్షకులకు డబ్బులు రిటన్ చేయరు.
4. మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేస్తే, ముందుగా తీసుకున్న టికెట్ మళ్లీ మ్యాచ్ జరిగే తేదీ వరకు చెల్లుతుంది.
మీకు ఎన్ని డబ్బులు వస్తాయి..
టికెట్ ధరను తిరిగి చెల్లించేటప్పుడు, కొనుగోలుదారుకు కన్వీనియన్స్ ఫీజు చెల్లించరు. ఇది టికెట్ ధరలో 10-15 శాతం ఉంటుంది. ఇంకా బుకింగ్ ఛార్జీ (50-200 రూపాయలు), ప్లాట్‌ఫామ్ ఫీజులు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీ టికెట్ ధర ఐదు వేల రూపాయలు అయితే, మీరు రూ.750 కన్వీనియన్స్ ఫీజు, రూ.100 బుకింగ్ ఛార్జీతో సహా రూ.5,850 చెల్లించాలి, కానీ ఆ మ్యాచ్ జరగకపోతే మీకు రూ.5 వేలు మాత్రమే తిరిగి పొందుతారు.
READ ALSO: The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!