IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం: అబ్దుల్ రజాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Did Not Play With Pakistan In 1997-98 says Abdul Razzaq: భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగాలేకపోవడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2022లో దాయాది దేశాలు ఢీ కొన్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో మరోసారి భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే మెగా టోర్నీ భారత గడ్డపై జరుగుతుంది కాబట్టి పాక్ వస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. పాక్ ప్రభుత్వ అనుమతి ఇస్తేనే పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ 2023లో ఆడుతుందని పీసీబీ చెబుతోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. 1997-98 సమయంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం ఉండేదన్నాడు. ఓ ఇంటర్వ్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ… ‘ఇరు జట్ల ఆటగాళ్లకు పరస్పర గౌరవం మరియు స్నేహం ఉంది. కానీ పాకిస్థాన్‌తో పోటీపడని ఏకైక జట్టు భారత్ మాత్రమే. 1997-98లో పాకిస్తాన్ బలంగా ఉండేది. భారత్ ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేది. ఓటములను నివారించుకునేందుకు మాతో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇది 2023 కాబట్టి మన ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఇప్పుడు ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. , మ్యాచ్ రోజున ఎవరు మంచి ప్రదర్శన చేస్తారనేదే ముఖ్యం’ అని అన్నాడు.
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
Also Read: Higher Pension: హయ్యర్ పింఛన్ దరఖాస్తుకు రేపటితో గడువు ముగింపు
‘ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లూ బలంగా ఉన్నాయి. పాక్ జట్టు బలహీనంగా ఉందని అనలేం. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ 2023 సిరీస్‌ను చూస్తే.. ఏ జట్టు బెటర్ అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?. మంచి ప్రదర్శన చేసే జట్టు విజయం సాధిస్తుంది. అన్ని వదిలేసి ఇరు జట్లు ఎప్పటిలా మ్యాచ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం కొనసాగించాలి’ అని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌కు వచ్చింది. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్ళింది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు.
Also Read: OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!