NTV Telugu Site icon

IND vs PAK: ఎంత ప్రయత్నించినా.. భారత్-పాకిస్తాన్‌ ఫైనల్‌ ఆడవు! చరిత్రలోనే లేదు

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan will not play Final in Asia Cup: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. సూపర్-4 రౌండ్‌లో పాకిస్తాన్‌, శ్రీలంకపై గెలిచిన భారత్.. ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. నేటి పాకిస్తాన్‌, శ్రీలంక మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 17న భారత్‌తో ఫైనల్‌లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ని ఎలా అయినా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్ చేరాలని పాక్ భావిస్తోంది. అయితే భారత్-పాకిస్తాన్‌ ఫైనల్లో తలపడటం ఆసియా కప్‌ చరిత్రలోనే లేదని, ఈసారి కూడా అదే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ఆసియా కప్‌ 2023లో గ్రూప్‌-ఏ నుంచి భారత్, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు సూపర్‌-4కు అర్హత సాధించాయి. బంగ్లాపై గెలిచిన పాక్‌.. భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడి నెట్‌ రన్‌రేటు పరంగా శ్రీలంక కంటే వెనుకబడి ఉంది. బంగ్లాపై గెలిచిన లంక.. టీమిండియా చేతిలో ఓడినా రన్‌రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉంది. ఇక పాకిస్తాన్‌, శ్రీలంక మీద జయభేరి మోగించిన భారత్.. ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో నేడు లంకతో పాక్ పోటీపడనుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయపడటంతో సతమతం అవుతున్న పాక్.. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్‌ పరిస్థితులను చూస్తే.. విషయం ఏంటో అర్థమైపోతోంది. భారత్-పాకిస్తాన్‌ ఫైనల్‌ ఆడాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా.. అది జరగదు. ఇండో-పాక్ జట్ల ఫైనల్లో ఢీకొట్టడం ఆసియా కప్‌ టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు కూడా అనుకూలించవు’ అని కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

Also Read: Ben Stokes Century: ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా బెన్‌ స్టోక్స్‌.. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు మిస్‌!

‘ఆసియా కప్‌ 2023 గ్రూప్‌ దశలోలో నేపాల్‌ను ఎందుకు చేర్చారో అర్ధం కావడం లేదు. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. నాలుగు టీమ్స్ సూపర్‌ 4కి చేరతాయి. ఆపై రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. మిగతా మ్యాచ్‌లకు కాదని కేవలం భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్‌కే రిజర్వ్‌ డే కేటాయించడం బాలేదు. ఇది కేవలం ఇండో-పాక్ జట్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లా కనిపిస్తోంది’ అని ఆకాశ్‌ చోప్రా మండిపడ్డాడు.