Ben Stokes Century: ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా బెన్ స్టోక్స్.. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు మిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes struck the highest score by an England batsman in ODI: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (182; 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన స్టోక్స్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని స్టోక్స్ ఇటీవలే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు. రిచర్డ్స్ 189 రన్స్ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు రాస్ టేలర్ (181), ఏబీ డివిలియర్స్ (176), కపిల్ దేవ్ (175)లను అధిగమించి.. బెన్ స్టోక్స్ రెండో స్థానానికి చేరుకున్నాడు. వివియన్ రిచర్డ్స్ 181 పరుగులు కూడా చేశాడు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెన్ స్టోక్స్ చరిత్రకెక్కాడు. జేసన్ రాయ్ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. 2018లో ఆస్ట్రేలియాపై రాయ్ 180 రన్స్ చేశాడు. మరోవైపు వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా కూడా స్టోక్స్ నిలిచాడు. ఈ జాబితాలో చార్ల్స్ కొవంట్రీ (194), వివియన్ రిచర్డ్స్ (189), ఫాఫ్ డుప్లెసిస్ (185), ఎంఎస్ ధోనీ (183), విరాట్ కోహ్లీ (183) స్టోక్స్ కంటే ముందున్నారు. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు స్టోక్స్ మిస్ అయ్యాడు.
Also Read: Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు బెనిఫిట్స్!
మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ సహా డేవిడ్ మలాన్ (96; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదాడు. ఆపై లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 187 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (72) ఒంటరి పోరాటం చేశాడు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!