IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!రత క్రికెట్ అభిమానులకు శుభవార్త. మరో ఆసక్తికరమైన సిరీస్‌కు రంగం సిద్ధమైంది టీమిండియా. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) తమ 2026-27 అంతర్జాతీయ హోం సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించగా.. ఈ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్లలో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడనుంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20లతో ఇది న్యూజిలాండ్‌లో నిర్వహించే అతిపెద్ద అంతర్జాతీయ హోం సిరీస్‌గా నిలవనుంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో తొలి టీ20 మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 24న రెండో టీ20, అక్టోబర్ 27న మూడో టీ20 వెల్లింగ్టన్లో, అక్టోబర్ 30న నాలుగో టీ20 ఆక్లాండ్‌లో, నవంబర్ 1న ఐదో టీ20 హామిల్టన్‌లో నిర్వహించనున్నారు.
టీ20 సిరీస్ అనంతరం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 4న తొలి వన్డే ఆక్లాండ్‌లో జరగనుండగా, నవంబర్ 7న రెండో వన్డే వెల్లింగ్టన్లో, నవంబర్ 10న మూడో వన్డే హామిల్టన్‌లో జరుగుతుంది. నవంబర్ 13, 15 తేదీల్లో నాలుగో, ఐదో వన్డేలు మౌంట్ మాంగనుయ్‌లో నిర్వహించనున్నారు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్లో జరగనుండగా, రెండో టెస్టు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో నిర్వహించనున్నారు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ఈ పర్యటనపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ఉత్సాహంగా ఉంది. భారత జట్టును తమ దేశంలో ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ప్రత్యేకమని NZC చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ పేర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి క్రికెటర్లు న్యూజిలాండ్ గడ్డపై ఆడే అవకాశం ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయని ఆయన అన్నారు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఉన్న క్రికెట్ ప్రత్యర్థిత్వం, స్నేహబంధం ఈ సిరీస్ ద్వారా మరింత బలోపేతం అవుతుందని NZC భావిస్తోంది. భారత జట్టు ఎక్కడ ఆడినా అభిమానుల సందడి ప్రత్యేకంగా ఉంటుందని, ఈ సిరీస్ కూడా క్రికెట్ వేడుకగా మారనుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.
భారత్-న్యూజిలాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్:
టీ20 సిరీస్..
1వ టీ20 – అక్టోబర్ 22, క్రైస్ట్‌చర్చ్
2వ టీ20 – అక్టోబర్ 24, క్రైస్ట్‌చర్చ్
3వ టీ20 – అక్టోబర్ 27, వెల్లింగ్టన్
4వ టీ20 – అక్టోబర్ 30, ఆక్లాండ్
5వ టీ20 – నవంబర్ 1, హామిల్టన్
వన్డే సిరీస్..
1వ వన్డే – నవంబర్ 4, ఆక్లాండ్
2వ వన్డే – నవంబర్ 7, వెల్లింగ్టన్
3వ వన్డే – నవంబర్ 10, హామిల్టన్
4వ వన్డే – నవంబర్ 13, మౌంట్ మాంగనుయ్
5వ వన్డే – నవంబర్ 15, మౌంట్ మాంగనుయ్
టెస్టు సిరీస్..
1వ టెస్టు – నవంబర్ 19-23, వెల్లింగ్టన్
2వ టెస్టు – నవంబర్ 27 – డిసెంబర్ 1, క్రైస్ట్‌చర్చ్
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..