Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Ind Vs Nz Final Glenn Phillips Comments On Jasprit Bumrah

Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

Published Date :March 6, 2026 , 9:53 pm
By Gogikar Sai Krishna
  • బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్.. కానీ అతను కూడా మనిషే: ఫిలిప్స్
  • డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్లు పెద్ద సవాల్
  • లూజ్ బాల్ వస్తే బౌండరీకి పంపేందుకు సిద్ధం: కివీస్ వ్యూహం
  • వరుణ్ చక్రవర్తి స్పిన్ కూడా కీలక సవాల్
Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన గ్లెన్ ఫిలిప్స్, భారత బౌలింగ్ విభాగాన్ని, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బుమ్రాను ఒక ‘ప్రపంచ స్థాయి ఆపరేటర్’గా అభివర్ణించిన ఫిలిప్స్, అతని వద్ద ఉన్న వైవిధ్యమైన బంతులు, ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యంత ఖచ్చితత్వంతో వేసే యార్కర్లు ఏ బ్యాటర్ కైనా సవాలేనని అంగీకరించారు. అయితే, బుమ్రా అజేయుడేమీ కాదని, మిగిలిన ఆటగాళ్లలాగే అతను కూడా మనిషేనని, అతనికీ ఏదో ఒక రోజు తడబడే అవకాశం ఉంటుందని ఫిలిప్స్ వ్యాఖ్యానించారు.

Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..

“బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు, కానీ అతను కూడా మనిషే. అందరిలాగే అతనికి కూడా ‘బ్యాడ్ డే’ ఉండొచ్చు. ఆ రోజు (ఫైనల్ మ్యాచ్) అతనికి అలాంటి రోజే కావాలని మేము కోరుకుంటున్నాము” అని ఫిలిప్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా 18వ ఓవర్ వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయానికి బాటలు వేసిన తీరును ఆయన గుర్తు చేశారు.

 

బుమ్రా వేసే 4 ఓవర్లను కేవలం డిఫెన్స్ ఆడుతూ వదిలేయలేమని, అతను పొరపాటున లూజ్ బాల్ వేస్తే దానిని బౌండరీకి తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కివీస్ వ్యూహాన్ని బయటపెట్టారు. ఒకవేళ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో కట్టడి చేస్తే, దానికి తగ్గట్లుగా మైదానంలోనే తమ ప్రణాళికలను మార్చుకుంటామని ఫిలిప్స్ స్పష్టం చేశారు.

Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

కేవలం బుమ్రా మాత్రమే కాకుండా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం కూడా తమకు కీలకమని ఫిలిప్స్ పేర్కొన్నారు. గత ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుణ్‌ను ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని, బంతిని బట్టి ఆడుతూ ఒత్తిడిని అధిగమిస్తామని చెప్పారు. లక్షలాది మంది భారత అభిమానుల మధ్య, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం ‘డేవిడ్ vs గోలియత్’ పోరాటంలా ఉంటుందని, కానీ తమ జట్టుకు ఒత్తిడిని తట్టుకుని నిలబడటం తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన జ్ఞాపకాలను కివీస్ జట్టు గుర్తు చేసుకుంటోంది. ఆదివారం జరగబోయే ఈ అమీతుమీ పోరులో బుమ్రా తన ప్రతాపం చూపిస్తాడా లేక ఫిలిప్స్ ఆశించినట్లుగా కివీస్ పైచేయి సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.

Buying New AC Tips: ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket Final
  • cricket final India NZ
  • Glenn Phillips
  • Glenn Phillips on Bumrah
  • IND vs NZ Final

తాజావార్తలు

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

  • RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

  • SBI Bank Scam: ఖాతాదారులకు షాక్.. ఎస్‌బీఐ బ్యాంకులో బిగ్ స్కామ్..

  • Asim Munir: ఇరాన్‌లో ప్రత్యక్షమైన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఏం జరుగుతోంది?

  • Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions