IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
- 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలో..
- నేడు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో నాలుగో టీ20
- భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
- ఇషాన్ కిషన్ తిరిగి ప్లేయింగ్ XIలోకి వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటివరకు జరిగిన 3 టీ20 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచి ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి కివీస్‌ను వారి సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ XIలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కవుగా ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించేశాడు కూడా. కిషన్ రెండో, మూడో టీ20లకు దూరం కావడంతో రిజర్వ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించింది. మూడో టీ20లో వైభవ్ 45 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ.. కిషన్ ఫిట్‌గా ఉంటే అతడి స్థానంలో తిరిగి జట్టులోకి రావచ్చు.
Also Read
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. అయితే అతడి పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగో టీ20లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే వన్డే సిరీస్‌కు నితీశ్ పూర్తి ఫిట్నెస్తో ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే అతడి స్థానంలో శివమ్ దూబేకు అవకాశం దక్కవచ్చు. అలాగే అక్షర్ పటేల్‌కు కూడా ఒక మ్యాచ్ విశ్రాంతి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే ప్రస్తుతం రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా వరుసగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావించవచ్చు. వన్డే సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని అర్ష్‌దీప్‌కు రెస్ట్ ఇస్తే అతడి స్థానంలో మయాంక్ యాదవ్‌కు ప్లేయింగ్ XIలో అవకాశం దక్కవచ్చు. మ్యాచ్ ను అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో, సోనీ లివ్‌లో ఆన్లైన్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
భారత్ ప్లేయింగ్ XI (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (WK), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.
తాజావార్తలు
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?