IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
- వెల్లింగ్టన్లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 198/3
- భారత్ ముందు న్యూజిలాండ్ 199 పరుగుల భారీ లక్ష్యం..
- డారిల్ మిచెల్ 52 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 3rd T20I: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు కివీస్ బ్యాటర్లు గట్టి సవాలు విసిరారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి.. భారత్ ముందు 199 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (2)ను అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు. అయితే ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్, మరో ఓపెనర్ ఫిన్ అలెన్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫిన్ అలెన్ 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 40 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు వేగంగా 86 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (17) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా.. మిచెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 89 పరుగులు సాధించాడు.
Also Read
- CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
చివర్లో క్రీజులోకి వచ్చిన బెవాన్ జాకబ్స్ లు మిచెల్‌కు అదిరిపోయే సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి ఆఖరి 5 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు రాబట్టారు. జాకబ్స్ కేవలం 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 9.9 రన్ రేట్‌తో 20 ఓవర్లలో 198/3 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (1/33), అక్షర్ పటేల్ (1/36), నితీష్ కుమార్ రెడ్డి (1/38) తలో వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ (0/40), ప్రిన్స్ యాదవ్ (0/44) ధారాళంగా పరుగులు సమర్పించుకొని వికెట్లు తీయలేకపోయారు.
Innings Break!
#TeamIndia bowlers have done a fine job towards the backend of the innings to restrict the New Zealand total to 198/3.
Chase coming up shortly. Stay tuned.
Scorecard – https://t.co/zf4CnZQ8CD #NZvIND https://t.co/kP0vl3QVO6
— BCCI (@BCCI) October 27, 2026
తాజావార్తలు
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!