IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. బ్రిస్టల్ లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించి చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరచడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ 15 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (4), అభిషేక్ శర్మ (16) కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. శివమ్ దూబే 22 పరుగులతో శ్రేయాస్‌కు అండగా నిలిచినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. తిలక్ వర్మ 11, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకే పరిమితమయ్యారు. దీనితో 158 పరుగులకే పరిమితమయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు తొలి షాక్ మూడో ఓవర్ లోనే తగిలింది. జోస్ బట్లర్ 8 పరుగుల వద్ద అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత భారత్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ చెలరేగిపోవడంతో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. బ్రూక్ కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో అజేయంగా 55 పరుగులు సాధించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు అజేయంగా 146 పరుగులు జోడించి కేవలం 13.5 ఓవర్లలోనే ఇంగ్లండ్‌కు ఘన విజయాన్ని అందించింది.
158 పరుగుల లక్ష్యాన్ని కాపాడాల్సిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ తీసిన ఒక్క వికెట్ మినహా మిగతా బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ ధాటికి భారత బౌలింగ్ దాడి పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విజయంతో ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేకాదు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ, 3-0 అజేయ ఆధిక్యంతో ఇంగ్లండ్ ఇప్పటికే ట్రోఫీని సొంతం చేసుకుంది.
సిరీస్ ఇప్పటికే చేజారిపోవడంతో చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ అదే జోరును కొనసాగిస్తూ 4-0 ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!