Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. 62 పరుగులు చేసిన అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ రనౌట్ అవ్వగానే అభిమానులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ రనౌట్‌పై ఇప్పటికే జడేజా స్పందించగా.. సర్ఫరాజ్ కూడా స్పందించాడు.
‘మా మధ్య అవగాహన లోపించింది. క్రికెట్ ఆటలో ఇలాంటివి అన్ని సహజమే. ఎవరో ఒకరు రనౌట్ అవుతుంటారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు రవీంద్ర జడేజా మద్దతుగా నిలిచాడు. సూచనలు ఇస్తూ నన్ను నడిపించాడు. లంచ్ సమయంలోనూ జడ్డుతో మాట్లాడా. బ్యాటింగ్ గురించి మేం చర్చించుకున్నాం. అరంగేట్రం చేసిన బ్యాటర్ ఎలాంటి ఒత్తిడికి గురి అవుతాడో జడేజా అనుభవించిందే. ఈ మ్యాచ్‌లో తొలిసారి స్వీప్ షాట్‌కు ఆడేందుకు యత్నించి విఫలమయ్యా. అప్పుడు జడేజా నా దగ్గరకు వచ్చి.. కాస్త సమయం తీసుకోమన్నాడు. జడేజా సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించా’ అని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Farmers Protest 2024: సానుకూలంగానే చర్చలు.. రైతు సంఘాలతో ఆదివారం మరోసారి సమావేశం!
భారత స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు రవీంద్ర జడేజా (99), సర్ఫరాజ్ ఖాన్ (62) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన బంతిని జడేజా షాట్ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. మార్క్ వుడ్ బంతిని అందుకోవడంతో.. వెంటనే జడేజా వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్ దాటేసిన సర్ఫరాజ్.. తిరిగి క్రీజులోకి వచ్చే లోపే వుడ్ వికెట్లను గిరాటేశాడు. దీంతో సర్ఫరాజ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
Tuk Tuk agent Jadeja got the debutant Sarfaraz Khan runout.
Sarfaraz was batting well for Dinda Academy and was having a ball pic.twitter.com/OH7rfF3Gku
— Dinda Academy (@academy_dinda) February 15, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!