NTV Telugu Site icon

IND vs ENG Test: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 93/3! ఇంగ్లండ్‌దే మొదటి సెషన్

Rohit Sharma Half Century

Rohit Sharma Half Century

Rohit Sharma hits Half Century at Day 1 Lunch Break: రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. రోహిత్‌ శర్మ (52), రవీంద్ర జడేజా (24) క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పటీదార్‌ (5) పరుగులకే ఔటయ్యారు. మార్క్ వుడ్ 2 వికెట్స్ పడగొట్టగా.. టామ్ హర్ట్‌లీ 1 వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దెబ్బకొట్టిన ఇంగ్లండ్‌.. మొదటి సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది.

ఇన్నింగ్స్‌ ప్రారంభమైన కాసేపటికే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మార్క్‌ వుడ్‌ వేసిన నాలుగో ఓవర్ ఐదవ బంతికి స్లిప్‌లో ఉన్న జో రూట్‌కు యశస్వి జైస్వాల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాసేపటికే మార్క్‌ వుడ్‌ మరో వికెట్ పడగొట్టాడు. అతడు వేసిన 6వ ఓవర్ నాలుగో బంతి శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. 9వ ఓవర్ ఐదవ బంతికి టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో కవర్స్‌లో ఉన్న బెన్ డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి రజత్‌ పటీదార్ ఔట్ అయ్యాడు.

Also Read: Dunki OTT: ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్‌ ఖాన్‌ ‘డంకీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

9 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆదుకున్నాడు. రెండు లైఫ్‌లు దక్కడంతో బతికిపోయిన రోహిత్.. దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 71 బంతుల్లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. ఈ సిరీస్‌లో ఇదే తొలి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. మరోవైపు రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోయాడు. చెత్తబంతులను బౌండరీలు తరలిస్తూ.. పరుగులు చేస్తున్నాడు. రెండో సెషన్‌లో ఈ ఇద్దరు నిలిస్తే భారత్ మెరుగైన స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.