Shah Rukh Khan’s Dunki Premieres on Netflix: పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం తాప్పీ పొన్ను హీరోయిన్‌గా నటించగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాదిలో ప్రభాస్ ‘సలార్’కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా.. పఠాన్, జవాన్ చిత్రాల రేంజ్‌లో మెప్పించలేకపోయింది. రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
డంకీ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే.. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది. గురువారం (ఫిబ్రవరి 15) అర్ధరాత్రి నుంచి డంకీ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఈ సినిమా చేరడం విశేషం.
Also Read: IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా!
నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్ సినిమాలు సలార్, గుంటూరు కారం, హాయ్ నాన్న టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. డంకీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. ఇప్పుడు కూడా హిందీలోనే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఆడియెన్స్ చూడొచ్చు.