Hardik Pandya Shot: ఏంటి హార్దిక్.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
- ఫుల్ ఫామ్‌లో హార్దిక్ పాండ్యా
- తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
- నో-లుక్ షాట్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya No-Look Shot Video: ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను వణికించాడు. హార్దిక్ అదే ఫామ్‌ను కంటిన్యూ చుస్తున్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే హార్దిక్ కొట్టిన ఓ షాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
Also Read: IND vs BAN: ఇది నాకు రీబర్త్‌డే.. భావోద్వేగానికి గురైన టీమిండియా ప్లేయర్!
Also Read
గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్ రిషద్ హొస్సేన్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి సూపర్ సిక్స్ కొట్టాడు. డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా స్టాండ్స్‌లోకి బంతిని పంపాడు. ఆ తరువాత తస్కిన్ అహ్మద్ వేసిన 12వ ఓవర్లోని మూడో బంతికి హార్దిక్ అద్భుతమైన షాట్ ఆడాడు. ‘నో-లుక్’ షాట్ ఆడగా.. కీపర్ తలా మీదుగా బంతి బౌండరీ దాటేసింది. షాట్ తర్వాత హార్దిక్ బంతిని చూడనే లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్దిక్ షాట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘ఏంటి హార్దిక్.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా’ అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Clutch. It’s in his DNA 🥶@hardikpandya7 pic.twitter.com/0s2qx2VcfU
— 𝘿𝙞𝙡𝙞𝙥𝙑𝙆18 (@Vk18xCr7) October 6, 2024
Unreal shot for SIX by Hardik Panyda! Only he could hit the spinner off the backfoot. Crazy scenes 🇮🇳🔥🔥#INDvBAN #tapmad #DontStopStreaming pic.twitter.com/79EJRddv6F
— Farid Khan (@_FaridKhan) October 6, 2024
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..