Varun Chakravarthy Says I Feels nice to be back in the Team India: మూడేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశానని, ఇది పునర్జన్మలా (రీబర్త్‌డే) భావిస్తున్నట్లు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. గతంలో ఏం జరిగిందనే దాని గురించి తాను అస్సలు ఆలోచించనని, ప్రస్తుతం ఏం చేయగలం అనే దానిపైనే దృష్టిపెడతా అని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటా అని వరుణ్ చక్రవర్తి ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుణ్ గొప్పగా పునరాగమనం చేశాడు. 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు.
మ్యాచ్ అనంతరం వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘మూడు సంవత్సరాల తరువాత భారత జట్టుకు ఆడాను. చాలా భావోద్వేగంకు గురయ్యాను. మళ్లీ బ్లూ జెర్సీని ధరించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రీబర్త్‌డే. నేను నా ప్రక్రియకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. నేను ఐపీఎల్‌లో కూడా అదే ఫాలో అవుతున్నాను. గతంలో ఏం జరిగిందనే దాని గురించి నేను అస్సలు ఆలోచించను. ప్రస్తుతం ఏం చేయగలం అనే దానిపైనే మాత్రమే దృష్టిపెడతా. జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడం సంతోషంగా అనిపిస్తోంది’ అని వరుణ్ చెప్పాడు.
Also Read: IND vs BAN: అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్ శాంటో
‘ఈ మూడేళ్లలో ఐపీఎల్‌తో పాటు కొన్ని టోర్నమెంట్లు ఆడాను. అందులో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఒకటి. ఇది మంచి టోర్నమెంట్. ఎప్పటికప్పుడు నా ఆటతీరును మెరుగుపర్చుకుంటూనే ఉన్నా. యాష్ (అశ్విన్) భాయ్‌తో కలిసి ఆడటం కూడా కలిసొచ్చింది. మేము ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాము. అది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ మ్యాచులో నా తొలి ఓవర్‌లోనే క్యాచ్ డ్రాప్ అయింది. ఇలాంటి వాటిపై నేను ఫిర్యాదులు చేయను. క్రికెట్‌లో ఇలాంటివి మామూలే. భారత్ తరఫున ఆడనప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యక్తులు మిమ్మల్ని చులకనగా చూస్తారు. జట్టులో చోటు కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. దేవుడి దయతో ఈసారి నాకు అవకాశం వచ్చింది. ఇకపై కూడా నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటాయి’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు.