IND vs AUS Tickets: నవంబర్ 15 నుంచి భారత్-ఆస్ట్రేలియా టికెట్ల విక్రయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Australia Visakhapatnam T20 Match Tickets Sale: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ 2023కి ముందు వన్డే సిరీస్ ఆడిన ఇరు జట్లు.. త్వరలో పొట్టి సిరీస్ ఆడనున్నాయి. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగుతుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్స్ విక్రయాలు నవంబర్ 15 నుంచి మొదలు కానున్నాయి.
ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో నవంబర్ 23న జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఈ నెల 15 నుంచి ఆరంభం అవుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ రెడ్డి తెలిపారు. నవంబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం లింక్ ద్వారా టికెట్స్ విక్రయాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
Also Read: Cows Trample Devotees: ఆవులతో తొక్కించుకున్న భక్తులు.. కారణం ఏంటంటే?
ఆఫ్‌లైన్ టికెట్స్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలలో అందుబాటులో ఉంటాయని ఏసీఏ కార్యదర్శి చెప్పారు. రూ. 600, రూ. 1500, రూ. 2,000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక డిసెంబర్ 3న జరిగే ఐదవ టీ20కి ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఇక్కడే జరుగుతుందో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..