Renault Offer: ప్రస్తుతం దేశీయంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో, కార్ల తయారీదారులు కొత్త మోడళ్లతో తమ సేల్స్‌ను పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటిలో రెనాల్ట్ (Renault) కూడా కీలకంగా నిలిచింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన రెనాల్ట్ కంపనీ 2025 సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటంటే.. 2025 సంవత్సరం కొత్త ఆఫర్‌తో రెనాల్ట్ తన వాహనాలపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో, కొత్తగా రెనాల్ట్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు వాహనంలోని మెకానికల్, మెటీరియల్, తయారీ లోపాలు, ఎలక్ట్రికల్ వైఫల్యాలకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినా, అదనపు ఛార్జీలు లేకుండా పరిష్కరించబడతాయనమాట.
Also Read: WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
రెనాల్ట్ ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, యాక్సిడెంటల్ టోయింగ్ కవరేజీ వంటి సౌకర్యాలను కూడా అందిస్తోంది. కస్టమర్లు తమ వారంటీని 4, 5, 6, లేదా 7 సంవత్సరాల పాటు వరకు పొడిగించుకోవచ్చు కూడా. ఇది 1,00,000 కి.మీ., 1,20,000 కి.మీ., 1,40,000 కి.మీ. లేదా అపరిమిత కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, రెనాల్ట్ భారత దేశంలో క్విడ్ (Kwid), కైగర్ (Kiger), ట్రైబర్ (Triber) మోడల్స్‌ను విక్రయిస్తోంది. ఈ 2025 సంవత్సరంలో, రెనాల్ట్ డస్టర్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డస్టర్ మోడల్ 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇది రెనాల్ట్‌కు భారతదేశంలో మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కీలకంగా మారనుంది.
Also Read: South Korea : ప్రజల నిరసన, రెడీగా పోలీసులు.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ కు రంగం సిద్ధం
రెనాల్ట్ ఈ కొత్త ఆఫర్, కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించడం ద్వారా 2025లో సేల్స్‌ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఈ ఆఫర్ ద్వారా ఇతర పెద్ద కార్ల కంపెనీలను సమర్థంగా పోటీ చేసే అవకాశం రెనాల్ట్‌కు లభించనుంది. రెనాల్ట్, తమ సరికొత్త ఆఫర్‌తో పాటు కొత్త డస్టర్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయాలని భావిస్తుంది. దీని ద్వారా, రెనాల్ట్ మరోసారి తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.