Gabba Test: గబ్బా టెస్ట్.. వ్యూహం మార్చిన టీమిండియా!
- డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు ప్రారంభం
- రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు
- కీలకంగా గబ్బా టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్ జోడిని కొనసాగించారు. దాంతో హిట్‌మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్‌గా రాహుల్ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది. సీమర్లకు స్వర్గధామమైన గబ్బా మైదానంలో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సాధారణంగా నెట్స్‌లో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఓపెనర్లు వస్తారు. బ్రిస్బేన్‌లో జరిగిన సెషన్‌లలో రోహిత్ శర్మ కూడా త్వరగానే వచ్చి ప్రాక్టీస్ చేశాడు. బంతి మెరుపు కోల్పోని సమయంలోనే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌ల బౌలింగ్‌లో సాధన చేశాడు. దీంతో గబ్బాలో రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీమర్లను ఎదుర్కోవడంలో హిట్‌మ్యాన్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా భారత్ ఈ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?
ఇక టీమిండియా సెషన్స్ మొత్తంను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ బృందంతో కలిసి పర్యవేక్షించాడు. విరాట్ కోహ్లీతో గౌతీ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం టీమ్ ప్లేయర్స్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!