బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మొదటి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంబించాల్సి ఉంది. చివరి రోజు ఆటలో వర్షం కారణంగా ఇప్పటికే గంటకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఆటకు మరింత ఆలస్యం కానుంది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోయే మ్యాచులో టీమిండియాను వరణుడు కాపాడాడు అనే చెప్పాలి.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 252/9తో ఐదవ రోజు ఆట కొనసాగించిన భారత్.. మరో 8 పరుగులు జోడించి 78.5 ఓవర్లకు ఆలౌటైంది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన ఆకాశ్ దీప్ 31 (44 బంతుల్లో) వెనుదిరిగాడు. హెడ్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. బుమ్రా (10) నాటౌట్‌గా నిలిచాడు. భారత్ ఇంకా 185 పరుగుల వెనకంజలో ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా 246 పరుగులు చేయడంతో ఫాలో ఆన్ తప్పింది. ప్రస్తుతం బ్రిస్బేన్లో భారీ వర్షం పడుతుండడంతో మ్యాచ్ ఆరంభం అవ్వడం కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.