బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మొదటి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంబించాల్సి ఉంది. చివరి రోజు ఆటలో వర్షం కారణంగా ఇప్పటికే గంటకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఆటకు మరింత ఆలస్యం కానుంది.…