Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Aus 3rd Odi Rohit Sharma Hits Most Sixes Across Formats In Home Conditions

Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో ప్రపంచ రికార్డు

Published Date :September 27, 2023 , 7:32 pm
By NTV WebDesk
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో ప్రపంచ రికార్డు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) కొట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అయ్యేలోపే హిట్ మ్యాన్ 5 సిక్సర్లు కొట్టి.. న్యూజిలాండ్‌ ప్లేయర్ మార్టిన్‌ గప్తిల్‌ (256) పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా నిలిచాడు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి

మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు దగ్గరలో రోహిత్‌ శర్మ చేరుకుంటున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం​, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (553) పేరుపై ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ శర్మ కేవలం 4 సిక్సర్ల దూరంలోనే (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక, ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ ప్లేస్ లో, విరాట్‌ కోహ్లీ 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు.

Read Also: Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..

ఇదిలా ఉంటే.. టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 రన్స్ తో భారీ స్కోర్‌ చేసింది. టాప్‌ 4 బ్యాటర్లు వార్నర్‌ (56), మార్ష్‌ (96), స్టీవ్‌ స్మిత్‌ (74), లబూషేన్‌ (72) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్‌ టీమిండియా ముందు భారీ టార్గెట్ పెట్టింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ తీసుకున్నారు.

Read Also: Divi Vadthya: దివి.. ఏంటీ పని.. ఈ రేంజ్ హాట్ ట్రీట్ తో తట్టుకోవడం ఎలా?

ఇక, భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దొరికింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు), వాషింగ్టన్‌ సుందర్‌ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. అనంతరం సుందర్‌, రోహిత్ శర్మ ఔట్ కాగా.. క్రీజులో విరాట్‌ కోహ్లీ ( 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు నౌటౌట్ ), శ్రేయస్ అయ్యారు ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 144/2గా ఉంది. భారత్‌ లక్ష్యానికి మరో 209 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • Ind vs Aus 3rd ODI
  • Most Sixes
  • rohit sharma
  • Team India

తాజావార్తలు

  • Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

  • Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

  • Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • Pakistan: మిడిల్ ఈస్ట్‌కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions