Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులు బద్దలు!
- ఫామ్‌లోకి వచ్చిన విరాట్
- పలు రికార్డులపై కన్నేసిన కింగ్
- మరొక్క సెంచరీ చేస్తే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ పలు రికార్డులపై కన్నేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ రికార్డులను బ్రేక్ చేస్తాడు. మరో సెంచరీ సాధిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సచిన్‌తో కలిసి విరాట్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 65 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సెంచరీలు చేయగా.. 44 ఇన్నింగ్స్‌లోనే విరాట్ 9 శతకాలు బాదాడు. మరొక్క సెంచరీ చేస్తే సచిన్‌ను అధిగమించి కింగ్ అవుతాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (8 సెంచరీలు, 51 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు, 37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు, 40 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Also Read: Champions Trophy 2025: భారత్‌కు రావొద్దు.. పాక్‌కు హర్భజన్ కౌంటర్!
విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ 11 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న విరాట్ ఆస్ట్రేలియాపై 10 శతకాలు చేశాడు. ఈ జాబితాలో జేబీ హాబ్స్ (9 సెంచరీలు-ఆస్ట్రేలియాపై), సచిన్ టెండూల్కర్ (9 సెంచరీలు-శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ మరో ఘనత అందుకుంటాడు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!