IND vs AUS: పెర్త్ టెస్ట్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
- పెర్త్‌లో మొదటి టెస్ట్ ఆరంభం
- అశ్విన్ లేకుండానే బరిలోకి భారత్
- ఆదివారం జట్టును కలుసుకోనున్న రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో మొదటి టెస్ట్ ఆరంభం అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు అరంగేట్రం చేశారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చాడు. యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు.
తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. నవంబర్ 15న రోహిత్ సతీమణి రితిక మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో భార్య చెంత ఉండేందుకు తాను పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండదని బీసీసీఐకి హిట్‌మ్యాన్ చెప్పాడు. రోహిత్ గైర్హాజరు నేపథ్యంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. శనివారం రోహిత్ ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. నవంబర్ 24న జట్టును కలుసుకోనున్నాడు. తొలి టెస్టు మూడోరోజు నాటికి హిట్‌మ్యాన్ పెర్త్‌కు చేరుకోనున్నాడు. డిసెంబర్ 6న అడిలైడ్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులో రోహిత్ ఆడతాడు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Also Read: AUS vs IND: టాస్ గెలిచిన బుమ్రా.. నితీశ్ రెడ్డి అరంగేట్రం! సీనియర్స్ అవుట్
పెర్త్‌లో రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. రోహిత్ భారత్‌లోనే ఉన్నా.. జట్టు సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బుమ్రా చెప్పాడు. ఇక భారత జట్టుకు ఈ టెస్ట్ సిరీస్ కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే 4-0తో టీమిండియా గెలవాల్సి ఉంది. అయితే సొంతగడ్డపై న్యూజీలాండ్ చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉంది. అందులోనూ ఫామ్ లేమి, గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!