AUS vs IND: ఐయామ్ ఇంప్రెస్‌డ్.. బుమ్రాపై ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు!
- భారత జట్టు సారథిగా బుమ్రా
- బుమ్రాపై గిల్‌క్రిస్ట్ ప్రశంసలు
- సారథ్యంలోనూ ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్‌గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు.
తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అయినా కెప్టెన్ బుమ్రా ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. మార్నస్ లబుషేన్ వంటి డేంజరస్ బ్యాటర్‌ను ఔట్ చేసే అవకాశం మిస్ అయినా.. చిరునవ్వు చిందించాడు. ఈ సందర్భంలో మరొకరైతే అరిచేవారు. కనీసం మందలించేవారు. బుమ్రా మాత్రం ఇవేమీ చేయకపోగా.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇది చూసిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆశ్చర్యానికి గురయ్యాడు. బుమ్రాప్రవర్తించిన తీరుకు తాను ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు. బుమ్రా రియాక్షన్ అద్భుతం అని, ఫర్వాలేదు అన్నట్లు ప్రవర్తించాడని పేర్కొన్నాడు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… ‘బౌలర్ అయిన బుమ్రా ఇప్పుడు కెప్టెన్. అతడే బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికే ఓ వికెట్ తీసిన ఉత్సాహంలో ఉన్నాడు. ఆ సమయంలో లబుషేన్ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. స్లిప్‌లో కోహ్లీ మంచి క్యాచర్ కానీ.. అతడి చేతి నుంచి బంతి చేజారింది. అయినా బుమ్రా రియాక్షన్ అద్భుతం. చిరునవ్వు చిందించాడు. ప్రతిఒక్కరూ అతడిలా పాజిటివ్ దృక్పథంతో ఉండటం బాగుంది. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎంతటి మేటి బ్యాటరైనా కష్టపడాల్సిందే. ఏ క్షణంలోనూ తలొంచాడు. వికెట్ కొద్దిలో చేజారినప్పటికీ.. అతడి బౌలింగ్ యాక్షన్, స్టైల్, టెక్నిక్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయంలో బుమ్రా అద్భుతం. దానికి నేను కూడా ఇంప్రెస్ అయ్యా. బౌలర్‌గానే కాకుండా సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు’ అని చెప్పాడు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!