David Warner: వంద సిక్సులు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఖాతాలో మరో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌లో సిక్సర్ల శతకం పూర్తి చేసుకున్నాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో నేడు (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ భాయ్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ప్లేయర్ గా ప్లేయర్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్ కూడా కొట్టి తన సిక్సర్‌ల సంఖ్యను కేవలం 148 మ్యాచ్ ల్లోనే 101కి పెంచుకున్నాడు.
Read Also: India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక, ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 రన్స్ చేసి.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. డేవిడ్ వార్నర్ (52 ), మిచెల్ మార్ష్ (4), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కామెరిన్ గ్రీన్(31)లు అవుట్ కాగా.. ప్రస్తుతం క్రీజులో జోష్ ఇంగ్లిస్ ( 15 ), మార్కస్ స్టోయినీస్ (4 ) ఉన్నారు. ఇక, టీమిండియా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లను కట్టిడి చేస్తున్నారు.
Read Also: Danish Ali: “రాత్రంతా నిద్రపోలేదు”.. బీజేపీ ఎంపీ మతపరమైన వ్యాఖ్యలపై డానిష్ అలీ
ఇక, వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది.. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), రోహిత్ శర్మ (286), సనత్ జయసూర్య (270), మహేంద్ర సింగ్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ (195), సౌరబ్ గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లి (141), వీరేంద్ర సెహ్వాగ్ (136), సురేశ్ రైనా (120) 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?