టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ గేమ్ ఛేంజర్ అని, అతడు ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ అయితే తప్పక ఈ పని చేశావాడిని సన్నీ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ మంచి వికెట్ కీపర్ అని, అయితే పంత్ అందుబాటులో లేకుంటే రాహుల్ తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో జరిగిన గేమ్ ప్లాన్ షోలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘కేఎల్ రాహుల్ కూడా మంచి వికెట్ కీపర్. అయితే ఒక్క విషయం చెప్పాలి. రిషబ్ పంత్ ఒక కాలితో ఆడేలా ఉన్నా.. అతను జట్టులోకి రావాలి. పంత్ అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. నేను సెలెక్టరైతే పంత్ పంత్ ఒక కాలితో ఆడేలా ఉన్నా తీసుకుంటా. ఒకవేళ పంత్ అందుబాటులో లేకుంటే.. రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం మంచిది. జట్టులో సమతుల్యం కూడా వస్తుంది. రాహుల్‌ను ఓపెనర్‌గా. మిడిలార్డర్‌లో ఉపయోగించుకోవచ్చు’ అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం!
2022 డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం పంత్ గాయాల నుంచి కోలుకుని క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసే అవకాశముంది. పంత్ గాయపడినప్పటి నుంచి భారత్ సిరీస్‌కు ఒకరు చొప్పున వికెట్‌కీపర్‌తో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు వికెట్ కీపింగ్ చేశాడు. అయితే పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కానున్నాడు.