IND vs AFG 3rd T20 Prediction: అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీంఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్.. ఏ మేరకు పోటి ఇస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్ 2024 ముందు దూకుడే మంత్రంగా భారత్ సాగుతోంది. బెంగలూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ మ్యాచ్‌లో అయినా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు అందుకోవాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన రోహిత్.. మూడో టీ20లో సత్తాచాటాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్ తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్‌లే ఉండటంతో.. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ గట్టి స్కోర్ చేసేందుకు ఈ మ్యాచ్‌ను సద్చేవినియోగం చేసుకోవాలి. మరోవైపు 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 181 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్‌లో కాస్త నెమ్మదిగా ఆడే విరాట్.. ముజీబ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేయడం విశేషం.
మూడో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్‌కు అవకాశమిస్తారా? అన్నది చూడాలి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నాలుగో టీ20లో అవకాశం దక్కించుకున్న జితేశ్ శర్మ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతడి బదులు శాంసన్‌కు అవకాశం రావోచ్చు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ లేదా వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశముంది. ఇక ముకేశ్ కుమార్ స్థానంలో అవేష్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు.
రషీద్ ఖాన్ లేక బలహీనంగా మారిన అఫ్గాన్.. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గుర్బాజ్ పెద్దగా రాణించలేదు. ఈ సిరీస్‌లో అఫ్గాన్ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించినా.. సమష్టిగా గట్టిపోటీ ఇవ్వడంలో విఫలమైంది. మరి ఆఖరి మ్యాచ్‌లోనైనా అఫ్గాన్ పోటీ ఇస్తుందో చూడాలి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది. కొత్త పిచ్‌పై మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలా పిచ్ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువ.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కోహ్లి, శివమ్ దూబె, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్/అవేష్ ఖాన్.
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదీన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబి, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీ.