India and Pakistan Share T20I Whitewash Record: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌లో భారత్ అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా టీంఇండియా నిలుస్తుంది.
ఇప్పటివరకూ టీ20 క్రికెట్ చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా కొనసాగుతున్నాయి. దాయాది దేశాలు రెండు 8 వైట్‌వాష్‌లు చేశాయి. నేడు అఫ్గాన్‌తో మూడో టీ20లో భారత్ విజయం సాధిస్తే.. 9 క్లీన్‌స్వీప్‌లు ఖాతాలో చేరుతాయి. దాంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీంఇండియా రికార్డుల్లో నిలుస్తుంది.
Also Read: ZIM vs SL: చివరి ఓవర్లో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకపై జింబాబ్వే స్టన్నింగ్ విక్టరీ!
అఫ్గాన్‌పై అద్భుత ప్రదర్శన చేసిన భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో అన్ని విబగాల్లో సత్తాచాటిన టీంఇండియా.. మూడో టీ20లోనూ ఆదిపత్యం కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్.. నేడు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది.