ZIM vs SL: చివరి ఓవర్లో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకపై జింబాబ్వే స్టన్నింగ్ విక్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Angelo Mathews Gives 24 Runs in 5 Balls in Last Over: శ్రీలంకకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే ఊహించని విజయాన్ని అందుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ లంక ఓటమికి కారణమయ్యాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లంక బ్యాటర్లలో పాతున్ నిస్సంక (1), కుశాల్ మెండిస్ (4), కుశాల్ పెరీరా (0), సమరవిక్రమ (16), దాసున్ షనక (9) పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అనంతరం 174 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే చివరి ఓవర్‌లో లూక్ జాంగ్వే మెరుపులు (25 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. క్రెయిగ్ ఎర్విన్ (70) హాఫ్ సెంచరీ చేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జాంగ్వే జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: Finn Allen Century: ఫిన్ అలెన్ ఊచకోత.. 16 సిక్స్‌లతో సెంచరీ! ప్రపంచ రికార్డు సమం
చివరి ఓవర్‌లో జింబాబ్వే 20 రన్స్ చేయాల్సి ఉంది. చివరి ఓవర్ తొలి బంతిని జాంగ్వే సిక్సర్ బాదాడు. ఆ బంతి నో కూడా. దీంతో ఆరు బంతుల్లో టార్గెట్ 13 రన్స్‌గా మారింది. ఫ్రీ హిట్ బంతికి ఫోర్, ఆ తర్వాత బంతికి జాంగ్వే సిక్సర్ కొట్టాడు. దాంతో చివరకు 4 బంతుల్లో మూడు రన్స్ అవసరం అయ్యాయి. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి జాంగ్వే క్యాచ్ డ్రాప్ కాగా.. ఒక పరుగు వచ్చింది. అయిదో బంతిని క్లైవ్ మదాండే సిక్సర్‌గా మలిచాడు. దాంతో మరో బంతి ఉండగానే జింబాబ్వే విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!