Income Tax Notice To Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Notice To Chandrababu: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయినషాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయాలు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ క్రమంలో షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందని.. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవీపీ) ఒప్పుకున్నారని తెలుస్తోంది..
Read Also: Corn Benefits : మొక్కజొన్నను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..
Also Read
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ఇక, చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఐటీ శాఖ. షాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టాయని.. ఫోనిక్స్ ఇన్ఫ్రా & పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలిందంటున్నారు. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా టచ్లోకి వెళ్లాడట మనోజ్ వాసుదేవ్. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారని అభియోగాలున్నాయి.. ఇక, చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల విషయాన్ని.. ఓ జాతీయ పత్రిక బయటపెట్టింది. అయితే, చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేగుతోంది.. దీనిపై టీడీపీ లేదా చంద్రబాబు కార్యాలయం స్పందించాల్సి ఉంది.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..