Income Tax: ఆదాయపు పన్ను శాఖ 2023-24 కోసం ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి 7 రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. అంటే ఈ తేదిని తాజాగా అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ ఒక నోటిఫికేషన్‌లో, ఆదాయపు పన్ను చట్టం కింద వివిధ ఆడిట్ నివేదికలను ఎలక్ట్రానిక్ ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ దృష్ట్యా, ఆడిట్ నివేదిక కోసం గడువు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించబడుతోంది.
Ravindra Jadeja: టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న జడ్డూ భాయ్..
అకౌంటింగ్ & కన్సల్టింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్ సింఘి, రజత్ మోహన్ ఈ పొడిగింపుకు కారణాన్ని మీడియాతో తెలిపారు. ట్యాక్స్ ఆడిట్ నివేదికను ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గడువును మరో ఏడు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించడం కూడా ముఖ్యమైనది. ఎందుకంటే దాని పెనాల్టీ చాలా భారీగా ఉంటుంది. చివరి తేదీ తర్వాత మీరు ఆడిట్ నివేదికను సమర్పించినట్లయితే, మీరు రూ. 1.5 లక్షలు లేదా మొత్తం అమ్మకాలలో 0.5 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలి. కాబట్టి ఎవరైనా ఇంకా రిటర్న్స్ చేయకపోతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
✅Central Board of Direct Taxes (CBDT) has decided to extend the specified date for filing of various reports of audit for the Previous Year 2023-24, which was 30th September, 2024 in the case of assessees referred in clause (a) of Explanation 2 to sub-section (1) of section 139… pic.twitter.com/jyuadaXm71
— Income Tax India (@IncomeTaxIndia) September 29, 2024