Zim vs Pak: జింబాబ్వే, పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (ఆదివారం) బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల తేడాతో డీఎల్‌ఎస్ నిబంధనతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే నవంబర్ 26న ఈ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 21 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసిన సమయంలో వర్షం కురిసింది. ఆ తర్వాత మరో ఆట జరగలేదు. ఆ సమయంలో జింబాబ్వే 80 పరుగుల ఆధిక్యంలో ఉంది. దింతో డీఎల్‌ఎస్ నిబంధనతో జింబాబ్వేను విజేతగా ప్రకటించారు.
Read Also: IPL 2025 Mega Auction: ఎస్ఆర్‌హెచ్ లోకి టాప్ స్పిన్నర్లు.. భారీ ధరకు అఫ్ఘాన్ స్పిన్నర్..
జింబాబ్వే తరఫున, రిచర్డ్ న్గర్వా 52 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు. సికందర్ రజా ఆరు ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. తడివనాశే మారుమణి 29 పరుగులు, సీన్ విలియమ్స్ 23 పరుగులతో ఆడారు. పాక్ బౌలర్లలో అఘా సల్మాన్, ఫైసల్ అక్రమ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. దింతో వర్షం వచ్చే సమయానికి ఆటలో వెనుకబడిపోయింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 19 పరుగులు చేసేందుకు 43 బంతులు ఆడాడు. ఇది కాకుండా కమ్రాన్ గులామ్ (17), సామ్ అయూబ్ (11) మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకోగలిగారు. జింబాబ్వే తరఫున బ్లెస్సింగ్ ముజారబానీ, సికందర్ రజా, సీన్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీశారు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన సికందర్ రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
39 with the bat 🏏
2/7 with the ball ☝️@SRazaB24 is the Player of the Match for his excellent all-round display in #ZIMvPAK 👏 pic.twitter.com/1LwxfEorzH— Zimbabwe Cricket (@ZimCricketv) November 24, 2024