Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
- 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
- ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం
- ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం, హర్మూజ్ ద్వారా జరిగే రాకపోకలను అడ్డుకుంటామని అది హెచ్చరించింది.
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్ ఓడరేవులకు వచ్చే, వెళ్లే నౌకలపై నావికా దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారా అమెరికా తన కట్టుబాట్లను ఉల్లంఘిస్తోందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. ఇరాన్‌కు వచ్చే అన్ని నౌకలకు అమెరికా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని అది పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులలో, హర్మూజ్ జలసంధి “కఠినమైన నియంత్రణ”లోనే ఉంటుందని కూడా సైన్యం తెలిపింది.
Also Read:CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి
లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం కుదిరే వరకు నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో, హోర్ముజ్ జలసంధిపై కఠినమైన నిర్వహణ, నియంత్రణను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. నావికా దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారా అమెరికా తన వాగ్దానాన్ని ఉల్లంఘించిందని అది పేర్కొంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!