విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా 62వ చిత్రంగా తెరకెక్కుతోన్న హెచ్.ఆర్. పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను చేసుకుంటుంది.
చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మలయాళ వెర్సటైల్ యాక్టర్ సిద్దికీ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
Also Read: Rinku Singh Virat Kohli: ‘ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యి ప్లిజ్’.. వీడియో వైరల్..
ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఆయన ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మలయాళ నటుడైన సిద్ధికీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ ఇలా కేవలం దక్షిణాది చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో ఈయన కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా విక్రమ్ పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన టైటిల్ టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ కాస్త పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో సిద్ధికీ కూడా నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Also Read: Dr K Laxman: భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యం..
ఈ సినిమాలో తనదైన స్టైలో విక్రమ్ డిఫరెంట్ లుక్, మాస్ యాక్టింగ్ తో కాళి పాత్రలో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు సిద్దమై పోయాడు. ఇక టైటిల్ టీజర్ ను చూసిన వారికి విక్రమ్ ఇప్పటి వరకు ఎప్పుడు చేయనటువంటి ఓ పాత్రలో మెప్పించబోతున్నారనే విషయం అర్థమైంది. ఇక సినిమాకి సంబంధించి సాంకేతిక వర్గంను చూస్తే.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్ లో, ఎస్.యు.అరుణ్‌కుమార్ రచన-దర్శకత్వం వహిస్తుండగా.. జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.