Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. దీనికి తండ్రి వ్యతిరేకించాడు. కానీ ఆ అమ్మాయి సరేమీరా అంది. వారిద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి లైసెన్స్ ఉన్న తుపాకీతో బాలికపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పాఠశాలలో ఉపాధ్యాయురాలి పనిచేస్తుండగా, తండ్రి కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
మైన్‌పురి జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ కాస్‌గంజ్‌లోని ఓ కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా బాలిక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తండ్రి అందుకు అంగీకరించలేదు. తండ్రి అమ్మాయికి చాలా నచ్చజెప్పాడు, కానీ ఆమె ప్రేమ మైకంలో వినలేదు. పైగా ‘నేను చదువుకున్నాను, నా కాళ్లపై నేను నిలబడతాను, నేనే నిర్ణయాలు తీసుకోగలను’ అని తన తండ్రికి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.
Read Also: IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
కోపంలో తండ్రి గదిలోకి వెళ్లి లైసెన్స్ ఉన్న తుపాకీని తీసుకొచ్చాడు. దీంతో బాలికపై తుపాకీ గురిపెట్టి కాల్చేసి.. పారిపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త, కుమార్తెను చూసి భార్య కేకలు వేయడం ప్రారంభించింది. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరువు పోతుందనే భయంతో తండ్రి చేసిన పనితో కుటుంబంలో విషాదం నెలకొంది.