Drugs Price : దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. ఇంధనం ధరలు భగభగ మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు చాలా ఖరీదైపోయాయి. ఇప్పుడు వీటికి తోడు మరొకటి తోడైంది. ఏప్రిల్ నెల నుండి మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు ఇప్పడు మరింత చిల్లులు పడనున్నాయి. జనవరి నుంచి మందుల ధరలు పెంచాలని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పలుమార్లు డిమాండ్ చేశాయి. అనేక వస్తువుల ధరల కారణంగా కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరిగింది. దాన్ని పూరించడానికి కంపెనీలు మందుల ధరలను పెంచేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. కేంద్రం కంపెనీల డిమాండుకు అనుమతించాయి.
ఒక నివేదిక ప్రకారం, మందుల ధర 12 శాతానికి పైగా పెరుగుతుంది. మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండో ఏడాది. షెడ్యూల్డ్ ఔషధాల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మందుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. నిబంధనల ప్రకారం ధర పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత ధర మారుతుంది. డబ్ల్యుపిఐ తగ్గడం వల్ల గత ఏడాది ఔషధాల ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలలో, రేటు పెంపు 1% మరియు 2% మధ్య ఉంది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also: Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
ధరలు పెరిగే వాటిలో నొప్పి నివారణలు, యాంటీబయాటిక్స్, గుండెకు సంబంధించినవి, క్షయ, ఇతర వ్యాధులకు సంబంధించినవి. ధరల పెంపుతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. వార్షిక టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ఈ ఆమోదం ఇవ్వబడుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీల విలువను నిర్ణయించే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) సోమవారం దీనికి సంబంధించి సూచన ఇచ్చింది.
Read Also: Bacteria : టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే ప్రదేశాలు ఏంటో తెలుసా ?
ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) సోమవారం వెల్లడించింది. దీని ప్రకారం, వార్షిక టోకు ధరల సూచిక ప్రకారం, ఔషధ కంపెనీలు మందుల ధరలను పెంచవచ్చు. ఏప్రిల్ నుంచి కొత్త ధర ప్రకారం వినియోగదారులపై భారం పడనుంది. ముడిసరుకు, సరఫరా, రవాణా, ఇతర ఖర్చుల పెరుగుదల కారణంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయంతో కంపెనీలు ఉపశమనం పొందుతున్నాయి. ఇది ఫార్మాస్యూటికల్ రంగం, కంపెనీలకు ఖర్చులను భర్తీ చేయడానికి సహాయపడుతుంది.