IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ఇంటర్నెట్ చౌకకావడంతో చాలా మంది వినియోగదారులు తమ పనిని ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. బ్యాంక్ చెల్లింపులు, ఆన్ లైన్ కొనుగోళ్లు అన్నీ చిటికెలో పూర్తవుతున్నాయి. అలాగే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇది కేవలం మెసేజింగ్ లేదా వీడియో కాలింగ్ కోసం మాత్రమే కాకుండా.. ఇప్పుడు దాని ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా నేరుగా మీ ఫోన్‌లో రైలు స్థితి, PNR స్టేటస్ పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. IRCTCకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీ నంబర్‌లో WhatsApp ద్వారా పొందవచ్చు.
వినియోగదారులు వాట్సాప్‌లో IRCTC రైలోఫీ చాట్‌బాట్ సేవ నుండి మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. వాట్సాప్ ద్వారా PNR స్టేటస్, రైలు స్థితిని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం. మీరు WhatsAppలో PNR, రైలు స్థితిని సులభంగా తనిఖీ చేయవచ్చు. IRCTC యొక్క Railofy AI చాట్‌బాట్ ద్వారా, మీరు లైవ్ రైలు స్థితిని వీక్షించవచ్చు. ఇక్కడ మీరు మీ WhatsAppలో స్టేషన్ ముందు లేదా తదుపరి స్టేషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
Read Also: Kim Jong Un: కిమ్ చేష్టలు.. బుల్లెట్లు మిస్సైనందుకు ఏకంగా నగరం మొత్తం లాక్‌డౌన్
WhatsAppలో PNR, లైవ్ స్టేటస్‌ని తనిఖీ చేయాలనుకుంటే ముందుగా WhatsAppలో Relofi AI Chatbotని ఉపయోగించాలి. దీని కోసం IRCTC ఇచ్చిన +919881193322 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేయండి. నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత ఓ సారి ఈ నంబర్‌ను వాట్సాప్ సెట్టింగ్‌లలో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు AI చాట్‌బాట్‌తో కనెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు PNR నంబర్‌ను నమోదు చేసి, రైలు లైవ్ స్టేటస్, అది ఏ స్టేషన్‌కు చేరుకుంది, లేదా ఎంత ఆలస్యమైందో చెక్ చేయవచ్చు. అలా కాకుండా మీరు ఆహారాన్ని ఆర్డర్ చేయాలనుకుంటే, మీరు IRCTC Zoop యాప్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు లేదా స్టేషన్‌లో రైలు నుండి దిగాల్సిన అవసరం లేదు. రైల్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి తినవచ్చు.
ఎలా ఉపయోగించాలి?
– దీని కోసం ముందుగా ఫోన్‌లో +91-9881193322 నంబర్‌ను సేవ్ చేయండి.
– వాట్సాప్‌లో రైలోఫీ చాట్‌ని తెరవండి.
– దీని తర్వాత 10 అంకెల PNR నంబర్‌ను నమోదు చేసి, WhatsAppలోని చాట్‌బాట్‌కు సందేశం పంపండి.
– దీని తర్వాత, ఇక్కడ మీరు రైల్వే చాట్‌బాట్ అయిన రైలోఫీపై లైవ్ రైలు అప్‌డేట్‌లను పొందుతారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!