NTV Telugu Site icon

UP: దారుణం.. భర్తను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. ఎందుకంటే?

Up

Up

మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

READ MORE: Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు!

నౌగవాన్ సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి అదే ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న మహిళా కానిస్టేబుల్‌తో వివాహమైంది. లేడీ కానిస్టేబుల్ ప్రస్తుతం బరేలీ జిల్లాలో విధులు నిర్వహిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక కుమార్తె భార్యతో మరొకరు భర్తతో నివసిస్తున్నారు. ఆ మహిళ తన భర్తపై ఒత్తిడి తెచ్చి మొదట మొరాదాబాద్‌లోని బుద్ధి బీహార్ కాలనీలో ఇల్లు కట్టించుకుంది. ఇంటి నిర్మాణం తర్వాత మహిళా కానిస్టేబుల్ తీరు మారింది. గ్రామంలోని భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి అతడు నిరాకరించడంతో ఇంటిని తన పేరు మీదకు మార్చుకుని భర్తను ఇంటి నుంచి గెంటేసింది.

READ MORE:Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..

డిసెంబర్ 5న ఇంటికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్ తన భర్తను కొట్టి, ఫేక్ కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు చూపించిన యువకుడు తన భార్యపై ఫిర్యాదు చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకునే ముందు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.

Show comments