మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.