Earthquake In Taiwan: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు
- తైవాన్ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం..
- పలుమార్లు కంపించిన భూమి.
- రిక్టర్ స్కేలుపై 6.4గా భూకంప తీవ్రత నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake In Taiwan: తైవాన్ (Taiwan) దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. యుజింగ్ జిల్లాలో (Yujing district) రాత్రి పలుమార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి మొదట 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటన యుజింగ్ జిల్లాలోని తైనన్ నగరానికి 4 కి.మీ దూరంలో చోటుచేసుకుంది. ఆపై అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక 6.4 తీవ్రతతో మరో భారీ భూకంపం (6.4 magnitude earthquake) సంభవించగా కొన్ని ఇల్లు కూలిపోయాయి.
Also Read: IND vs ENG: రేపటి నుంచే భారత్- ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్..
Also Read
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
🚨🇹🇼 #EARTHQUAKE HITS TAIWAN
A powerful 6.0-magnitude earthquake struck Taiwan on January 20, 2025. CCTV footage captures the intense moment.
Media Source: https://t.co/jNRBiS6TGg pic.twitter.com/oidEubEa7Y
— Weather Monitor (@WeatherMonitors) January 20, 2025
ఈ భూకంపం కారణంగా దక్షిణ తైవాన్‌లో 27 మంది గాయపడ్డారు. చియాయి కౌంటీలోని దాపు టౌన్‌షిప్‌లో భూకంప కేంద్రం గుర్తించారు. ఇది 9.4 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. నాన్క్సీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా, ఆ ఇళ్లలో చిక్కుకున్న ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. దక్షిణ తైవాన్ మాత్రమే కాకుండా భూకంప ప్రభావం రాజధాని తైపీ వరకు కూడా కనిపించింది. రాజధానిలో కొన్ని భవనాలు కంపించాయి కూడా. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. తైవాన్ ప్రభుత్వం భూకంప బాధితుల రక్షణ కోసం రెస్క్యూ చర్యలను వేగవంతం చేసింది. కూలిన ఇళ్ల వద్ద సహాయ చర్యలు చేపడుతూ, ప్రాణ నష్టం నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. భూకంపాలకు ఎక్కువగా గురయ్యే తైవాన్‌లో ఇటీవలి కాలంలో ఇది మరో పెద్ద భూకంపం. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?