NTV Telugu Site icon

IND vs SA Test : భారీ విజయంతో సౌతాఫ్రికాను చిత్తుచేసిన టీమిండియా..

Ind Vs Sa

Ind Vs Sa

IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్‌ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ ను 232/2 (ఫాలోఆన్‌) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ ని భారత మహిళలు 9.2 ఓవర్లలో పూర్తి చేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో షఫాలీ వర్మ 24, శుభా సతీష్ 13 పరుగులతో అజేయంగా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేసారు.

Monsoon: అలర్ట్.. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు..

ఇక టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు 603/6 రికార్డు స్కోరును సాధించి డిక్లేర్డ్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో స్టార్ ప్లేయర్ షెఫాలి వర్మ 197 బంతుల్లో 23×4, 8×6 సహాయంతో 205 పరుగులు డబుల్ సెంచరీతో అదరగొట్టింది. ఇక మరో ఎండ్ లో మరో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 161 బంతుల్లో 27×4, 1×6 సహాయంతో 149 పరుగులు చేసి మరోసారి తన సత్తాచాటింది. వీరితోపాటు రిచా ఘోష్‌ 86, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 69, జెమీమా రోడ్రిగ్స్‌ 55 కూడా రాణించడంతో భారీ స్కోర్ ను సాధించింది.

Pawan Kalyan: పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా..

ఇక తొలి ఇన్నింగ్స్‌ లో ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (8/77) విజృంభణతో దక్షిణాఫ్రికా 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో మారిజేన్ కాప్ 74, సునే లూస్‌ 65 లు రాణించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ఆడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ లో సౌతాఫ్రికా మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. లారా వోల్వార్ట్ 122, సునే లూస్ 109 శతకాలు చేయగా.. నాడిన్ డిక్లెర్క్‌ 61 హాఫ్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుంది.