Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దింతో నేడు సినీ బృందం వరంగల్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చాం.., మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా ఉంది. మణిశర్మ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ కి మించి చేశారు ఇందులో. వాటిని స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాయి. సంజయ్ దత్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. కావ్య చాలా మంచి అమ్మాయి. చాలా హార్డ్ వర్క్ చేసింది. విష్ హానెస్ట్ గా తన పని తను చేస్తూ ఉంటాడు. చార్మి ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు.
డైరెక్టర్ పూరితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. పూరి జగన్నాధ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరిని చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్ గా అయినా వెళ్తుంది. పూరి లాంటి గన్ అందరి యాక్టర్స్ కి కావాలి. లవ్ యూ సర్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు. ఆగస్టు 15న కలుద్దాం. లవ్ యూ ఆల్.. అని అన్నారు.