MCD Polls Results: బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెర.. ఢిల్లీ మున్సి’పోల్స్’లో ఆప్‌దే హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించి తన మార్క్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 250 వార్డులకు గానూ మ్యాజిక్ ఫిగర్ అయిన 126 స్థానాల కన్నా ఎక్కువ వార్డులలో విజయం సాధించింది. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ఘోర పరాభవం తప్పదు అని అంచనా వేసినా ఆప్‌కు కాస్త గట్టిగానే పోటీ ఇచ్చింది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా.. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. 250 వార్డులు గల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 4న పోలింగ్ జరగగా 50.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
Supreme Court Mobile App 2.0: పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు ‘సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0’
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఆప్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ పాలించింది. ఢిల్లీ వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టు సాధించలేదు. 2017 ఎన్నికల్లో 270 వార్డులు ఉండగా బీజేపీ 181 సీట్లు గెలిచింది. ఆమ్ఆద్మీ 48 చోట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 30 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఆమ్ఆద్మీ పార్టీకి తొలిసారి దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఆప్ తన విజయాన్ని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!