భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. మర్చి 22 శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. శివ కందుకూరి హీరోగా, పురుషోత్తం రాజ్ దర్శకత్వం నటించిన ఈ సినిమా సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముందుకు వెళ్తుంది. మార్చి 1 2024న సినిమా థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. రిలీజ్ కు ముందే ఆహా ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
Also Read: Meenakshi Chaudhary : థాయ్ లాండ్ వేకెషన్ లో మీనాక్షి చౌదరి..బోట్ పై విహరిస్తూ స్టన్నింగ్ పోజులు..
దర్శకుడు పురుషోత్తం రాజ్ భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను సీరియల్ కిల్లర్ కథకు పురాణాల్ని జోడించి తెరకెక్కించాడు. ఇందులో శివ కందుకూరి డిటెక్టివ్ గా నటించగా.. రాశీసింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఓ దిష్టిబొమ్మ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. ఓ సైకో మహిళల్ని హత్య చేస్తూ వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు. చాలా మంది అమ్మాయిలు చనిపోతున్న ఒక్క క్లూ కూడా పోలీసులు దొరకదు. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ దిష్టి బొమ్మ హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సీరియల్ కిల్లర్ హంతకుడిని పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఎంటర్ అవుతాడు.
Also Read: Holi Colours: హోలీ రోజున కళ్లు, నోటిలోకి రంగులు పోతే ఏం చేయాలి..?
ఆపి సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరు..? నర బలుల పేరుతో అమ్మాయిలను హతమార్చడానికి అసలు కారణం ఏమిటి..? కిల్లర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో హీరోయిన్ జర్నలిస్ట్ భాస్కర్ నారాయణకు ఎలా సహకరిస్తుంది..? లాంటి విషయాలే భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా కథ.