NTV Telugu Site icon

Heavy rainfall: ఈ రాష్ట్రాలకు అత్యధిక వర్ష సూచన

Raeiej

Raeiej

రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి. వచ్చే ఐదు రోజులు అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీ, యానాం, తమిళనాడులో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి..ఇద్దరు జవాన్ల మృతి

ఇక జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్‌లో వేడి గాలులు, జూన్ 25 వరకు జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతాయని తెలిపింది. అనంతరం తగ్గు ముఖం పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Suicide: భార్యభర్తల మధ్య గొడవలు.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య