Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Imd Rain Alert Heavy Rains Thunderstorms India States Weather Warning

IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Published Date :April 30, 2026 , 7:55 am
By Suresh Maddala
  • దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

దేశ వ్యాప్తంగా వాతావరణం మారిందని.. దీంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవగా.. గురువారం కూడా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ధూళి తుఫానులు కూడా ఏర్పడతాయని.. దీంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతారని పేర్కొంది.

Also Read

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..

ఇక దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ధూళి తుఫానులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే హర్యానా, పంజాబ్‌లో కూడా బలమైన గాలులతో పాటు ఆకస్మిక ధూళి తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బలమైన గాలుల వల్ల చెట్లు కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని వార్నింగ్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు వరదలకు గురికావచ్చని తెలిపింది.

రాబోయే కొద్ది రోజుల పాటు ఈశాన్య భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణ భారతదేశంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని.. అనవసర ప్రయాణాలను మానుకోవాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra pradesh weather
  • Bihar Jharkhand rain alert
  • Delhi weather today
  • dust storm warning India
  • heatwave relief India

తాజావార్తలు

  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

  • IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు

  • Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్‌ఆర్‌హెచ్‌ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions