TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ ద్వైపాక్షిక రాజకీయాలకు చరమగీతం పాడేలా కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ కేవలం అరంగేట్రం చేయడమే కాకుండా, ఏకంగా అధికార పీఠాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన తరహాలోనే విజయ్ కూడా రాజకీయ సంచలనం సృష్టించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న మార్పు కోరిక, యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్ విజయ్‌ను కింగ్ మేకర్‌గా లేదా నేరుగా కింగ్‌గా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం.. మొత్తం 234 స్థానాల్లో టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అధికార డీఎంకే కూటమి 92–110 స్థానాలకే పరిమితం కావొచ్చు. ఓట్ల శాతం పరంగా చూస్తే టీవీకే, డీఎంకే రెండు పార్టీలు 35 శాతం ఓట్లతో సమానంగా ఉన్నాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి కేవలం 23 శాతానికే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది.
Also Read
విజయ్ విజయంలో యువత పాత్ర అత్యంత కీలకం. మొదటిసారి ఓటు వేసే వారిలో 68 శాతం మంది విజయ్‌కు మద్దతు తెలపడం విశేషం. కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాకుండా ఓబీసీ, ఎస్సీ మరియు మైనారిటీ ఓటర్లను కూడా విజయ్ ఆకట్టుకోగలిగారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ‘మార్పు’ కావాలనే నినాదం బలంగా పనిచేసింది.
Post 10 of 10 – Tamil Nadu – Exit Poll – Overall Seat Share (234 Seats) & Vote Share (%)#TamilNaduelections2026#ExitPoll#AxisMyIndia
@pradeepgupta_ami pic.twitter.com/rlLm6u6Btl— Axis My India (@AxisMyIndia) April 29, 2026
ముఖ్యమంత్రి రేసులో విజయ్..
సర్వే ప్రకారం, 37 శాతం మంది విజయ్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, ప్రస్తుత సీఎం ఎం.కె. స్టాలిన్‌కు 35 శాతం మంది మద్దతు లభించింది. అంటే, రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే విజయ్ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎదిగారు.
Post 3 of 10 – Tamil Nadu – Exit Poll – Caste-wise (2 of 2) – Vote Share (%)#TamilNaduelections2026#ExitPoll#AxisMyIndia
@pradeepgupta_ami pic.twitter.com/ZZbgrXqG99— Axis My India (@AxisMyIndia) April 29, 2026
ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే.. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది లేదా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి కొత్త చరిత్రను లిఖిస్తుంది. డీఎంకే తన కంచుకోటను కాపాడుకోవడానికి పోరాడుతుండగా, ఏఐఏడీఎంకే ఉనికి ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ రాకతో తమిళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అయితే ఇతర సర్వేలు మాత్రం తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!